లోక్సభలో గందరగోళం నెలకొనడంతో సభను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పెద్దల సభగా పెరుపొందిన రాజ్యసభలోనూ సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు నిరసనలు తెలియజేశాయి. ఎంపీలు నిలబడి, బల్లలపైకి ఎక్కి పెద్దగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. విపక్షాల ఆందోళనలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక దేవాలయం వంటిదని, కొందరు ఎంపీలు అమర్యాదగా ప్రవర్తించారని, పోడియం ఎక్కి నిరసనలు చేయడం అంటే, గర్భగుడిలో నిరసనలు చేయడమే అని రాజ్యసభ…
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రసాభాసాగా సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నూతన వ్యవసాయ చట్టాలు, పెగాసస్ అంశంపై చర్చకు పట్టుబడుతూ వచ్చాయి విపక్షాలు. నినాదాలు, నిరసనల మధ్య సభను నిర్వహించారు. అయితే, ఈరోజు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజులపాటు లోక్సభ సమావేశాలు…
ఓబీసీలను గుర్తించే హక్కు తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ చట్టసవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు-2021ను లోక్సభలో ప్రవేశ పెట్టారు సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్. 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా అభివర్ణించారు. రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించటం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక, ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు.…
తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై…
లోకసభలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ…
పెట్రోల్, డీజిల్ ధరలు.. రోజురోజుకీ సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, జీఎస్టీ కౌన్సిల్ సమవేశం జరిగిన ప్రతీసారి.. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కానీ, ఆ ఉద్దేశమే లేదనేది తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.. ఎందుకుంటే.. ఆ దిశగా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ..…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలాగా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టిన రామ్మోహన్నాయుడు.. విశాఖ…