ఎస్టీ రిజర్వేషన్లపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఆ దిశగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా… పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు.. తెలంగాణలో 10 శాతం బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా? అంటూ లోక్‌సభలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్ రెడ్డి, కవిత మాలోతు.. కేంద్రాన్ని ప్రశ్నించారు.. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కి 10 శాతానికి పెంచిన రిజర్వేషన్లను ఆమోదించడానికి తెలంగాణ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనను స్వీకరించిందా? అలా అయితే, ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? ప్రభుత్వం ఆమోదం కోసం రాష్ట్రపతికి ప్రతిపాదనను పంపిందా? అలా అయితే, దాని వివరాలు.. కాకపోతే, దానికి గల కారణాలు ఏమిటి? అని ప్రశ్నించారు.
Read Also: Rs.2,000 Notes: రూ.2000 నోట్లకు రెండేళ్ల గడువు..! రద్దు చేయండి..
దీనికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి అర్జున్ ముండా… తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందని తెలిపారు.. బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు2017లో హోం శాఖకు చేరిందని.. కానీ, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉంది.. కాబట్టి.. నిర్ణయం తీసుకోలేమని చెప్పారు.. సుప్రీంకోర్టులో ఈ కేసు తెలిన తర్వాతే ఎస్టీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.. కాగా, దాదాపు ఆరేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ బిల్లును ఆమోదించి.. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, గిరిజనులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం ఆ బిల్లును పట్టించుకోలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు..