NCRB Data: దేశంలో నేరాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. కోట్ల కొద్ది కేసులు పరిష్కారం కాకుండా కోర్టుల్లోనే పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికే నేరాలు చేసిన వాళ్లతో జైళ్లన్నీ నిండుకున్నాయి. మరి పెండింగ్లో ఉన్న కేసులన్నీ పరిష్కారం అయి వాటిలో శిక్షలు పడ్డ ఖైదీలను ఎక్కడ ఉంచాలో ప్రభుత్వాలకే తెలియాలి. తాజాగా దేశంలోని జైళ్ల సామర్థ్యం 4.4 లక్షలుంటే.. 5.5 లక్షల మంది ఖైదీలు జైళ్లలో ఉన్నట్లు ప్రభుత్వం నివేదికలో ప్రకటించింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం 4.4 లక్షల ఖైదీల బస సామర్థ్యంతో 5.5 లక్షల మంది ఖైదీలు భారతీయ జైళ్లలో ఉన్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోక్‌సభలో తెలిపింది. అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా సమాధానమిచ్చారు. 2021 సంవత్సరానికి గానూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి).. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యుటిలు) సంబంధించిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా’ నివేదికను ప్రచురించింది.
Read Also: Inter Exams: ఇంటర్ పరీక్షలకు నిమిషం నిబంధన.. విద్యార్థులకు టెన్షన్!
ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2021 డిసెంబర్ 31, నాటికి భారతదేశం అంతటా జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీల సంఖ్య 5,54,034, జైలు సామర్థ్యం 4,25,069. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, జైలులో ఉన్న ఖైదీల సంఖ్య 63,751కి ఉండగా 1,17,789కి చేరుకుంది. బీహార్ జైళ్లలో 47,750 మంది ఖైదీలు ఉండగా, వారి సంఖ్య 66,879కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో గరిష్టంగా 49,571 మంది ఖైదీలు ఉండగా, 48,513 మంది ఖైదీలు జైలులో ఉన్నారు. ఢిల్లీలో 10,026 మంది ఖైదీలు ఉండగా 18,295 మంది ఉన్నారు. వారు చేసిన నేరానికి సంబంధించి గరిష్ట కాలానికి మించి శిక్షలు లేకుండా జైళ్లలో ఉన్న నేరస్థుల సంఖ్య గురించి ప్రభుత్వం వద్ద ఏదైనా డేటా ఉందా అని బార్పేట ఎంపీ అడిగారు.
Read Also: Balayya: ‘ఆహా’ అనగానే ఎదో ఎనర్జీ వచ్చేస్తుంది బాలయ్యకి… ఈసారి ‘ర్యాప్’ ఆడేసాడు
ఎన్‌సిఆర్‌బి వద్ద అటువంటి నిర్దిష్ట సమాచారం అందుబాటులో లేదని మిశ్రా చెప్పారు. డిసెంబర్ 31, 2021 నాటికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, జైలు శిక్ష పూర్తయిన తర్వాత జైలులో ఉంటున్న ఖైదీల సంఖ్యపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. శిక్ష పూర్తయిన తర్వాత జరిమానా మొత్తాన్ని చెల్లించకపోవడం వల్ల జైల్లో 1,410 మంది ఖైదీలు ఉన్నారని తెలిపింది.