Election Commission: కేంద్రం ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో రెడ్ లైన్ దాటొద్దని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనుండగా, మే 13 (సోమవారం), మే 20 (సోమవారం), మే 25 (శనివారం), జూన్ 1 (శనివారం) తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించింది.
Lok Sabha Elections 2024: కేంద్రం ఎన్నికల సంఘం లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు.
లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఎన్నికల సంఘం నుంచి వైదొలగాలని మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు.
Lok Sabha Elections 2024: ఎన్నిలక నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది. పోలింగ్‌లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొననున్నారని ఈసీ వెల్లడించింది.
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నట్లు ప్రకటించారు.
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీని విడుదల చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటేయడానికి మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో ఇందులో ఇటీవలే 18 ఏళ్లు నిండిన 1.8 కోట్ల మంది ఉన్నారు. వీరంతా తొలిసారి ఓటేసేందుకు అర్హత సాధించారు. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు…