Lok Sabha Elections 2024: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొననున్నారని ఈసీ వెల్లడించింది. కోటీ 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండగా.. దేశవ్యాప్తంగా 49.7 కోట్ల పురుష ఓటర్లు, 47.1 కోట్ల మహిళా ఓటర్లతో మొత్తం దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Read Also: Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..
జూన్ 16 లోపు కల ప్రక్రియ పూర్తవుతుందని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామని తెలిపారు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారని తెలిపారు. దేశంలో 48 వేల ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రం హోం ఆప్షన్ అందుబాటులో ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారన్నారు. వికలాంగులకు కూడా ఓట్ ఫ్రం ఆప్షన్ వర్తిస్తుందన్నారు.
Read Also: Election Schedule Announcement: మోగిన ఎన్నికల నగారా… 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్
పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్ల వాడకం
పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్ల వాడకం జరుగుతుందని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవుతాయని హెచ్చరించారు.
పోలింగ్ డ్యూటీలో వాలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బందికి నో ఎంట్రీ
పోలింగ్ డ్యూటీలో వాలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బందికి అనుమతి లేదని ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదన్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ.3400 కోట్లు సీజ్ చేశామన్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ జరుగుతుందన్నారు. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం జరుగుతుందన్నారు. ఓటు వేసిన వారు మళ్లీ ఓటు వేయడానికి వస్తే కేసు బుక్ చేస్తామన్నారు. ఫేక్ న్యూస్‌పై ఫ్యాక్ట్ చెక్ ఫెసిలిటీ పెట్టిస్తామని సీఈసీ వెల్లడించారు. స్టార్ క్యాంపెయినర్లకు గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పారు. కులమతాలను రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కులం, మతం పేరుతో ఓట్లు అడగొద్దన్నారు. ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఉండకూడదన్నారు. సూర్యాస్తమయం తర్వాత బ్యాంకుల క్యాష్ వ్యాన్లను కూడా అనుమతించబోం అని స్పష్టం చేశారు.
2100 మంది ఎన్నికల అబ్జర్వర్లు
2100 మంది ఎన్నికల అబ్జర్వర్లను నియమించామని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని సూచించారు. పార్టీల మిస్ లీడింగ్ వ్యాఖ్యలను అనుమతించమన్నారు.