జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Lok Sabha Elections 2024: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్ లో అర్ధరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం ఈ సోదాలు ముగిసాయి.
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ (శనివారం) వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తామని తెలిపింది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి తమ బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక, ఇవాళ ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఎన్డీయే కూటమి 400 లోక్ సభ స్థానాలను దక్కిచించుకుంటామనే నినాదం భారతీయ జనతా పార్టీకి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి 400కు పైగా సీట్లు గెలుచుకోవచ్చని తాజా సర్వేలో తేలింది.
Odisha: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీలు కూడా పొత్తుపై చర్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగి పోటీ చేస్తుందని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, ఈ విషయంపై పార్టీ పార్లమెంటరీ నిర్ణయమే అంతిమం అంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ గురువారం అన్నారు. గురువారం కేంద్ర…