మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.
PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
Lok Sabha Election 2024: బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌లోని మరో నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ మొత్తం 13 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Lok Sabha Election 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల మధ్య సమాజ్‌వాదీ పార్టీ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పిలిభిత్ నుండి బిజెపి ఎంపికి ఎస్‌పి టికెట్ ఇవ్వబడుతుందని ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచి ప్రారంభించినందున ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భయపడుతున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కలబురగితో పాటు కర్ణాటకలోని 20 లోక్‌సభ స్థానాలను పార్టీ గెలుచుకోవడం ఖాయమని అన్నారు.
బీజేపీ తన అభ్యర్థుల రెండు జాబితాలను విడుదల చేసింది. దీంతో పాటు బీజేపీ కూడా కొత్త తరం నేతల సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల 70 ఏళ్లు పైబడిన వారిని కూడా అభ్యర్థులుగా నియమించారు, అయితే చాలా చోట్ల బీజేపీ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను రద్దు చేసింది.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.
MK Stalin: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే సీఏఏని తమ రాష్ట్రంలో అమలు చేయమని డీఎంకే చెబుతున్న నేపథ్యంలో.. బీజేపీ సీఏఏతో ఆగడని, దాని తరుపరి లక్ష్యం వివిధ భాషల మాట్లాడే ప్రజలే అని ఆయన ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తులో వీటికి సంబంధించిన చట్టాలను తీసుకువస్తుందని ఆయన అన్నారు.
MP Sanjay Raut : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లేకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. పండిట్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు.. కాంగ్రెస్ లేకుంటే దేశానికి నాయకత్వం వచ్చేది కాదని ఉద్ధవ్ థాకరే (UTB) గ్రూపునకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా అన్నారు.
elangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.