Lok Sabha Elections 2024: 543 లోక్‌సభ స్థానాలకు 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ఏడు దశల్లో జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈరోజు తెలిపారు. ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు. సిక్కిం, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
*ఏప్రిల్ 19 – తొలి దశ ఎన్నికలు
*ఏప్రిల్ 26- రెండో దశ పోలింగ్.. రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్
*మే 7న మూడో దశ పోలింగ్
*మే 13న నాల్గో దశ పోలింగ్- ఈ రోజనే ఏపీ, తెలంగాణ పోలింగ్.. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్
*మే 20న ఐదో దశ పోలింగ్
*మే 25న ఆరోదశ పోలింగ్
*జూన్ 1న ఏడో దశ పోలింగ్
ఏ విడతలో ఎన్ని రాష్ట్రాల్లోని, ఎన్ని సీట్లకు పోలింగ్ తదితర వివరాలు: