Lok Sabha Elections 2024: ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నట్లు ఈసీ వెల్లడించింది. దాదాపుగా 82 రోజుల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది.
Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
Telangana: లోక్‌సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ…
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి శశి థరూర్ గత 15 సంవత్సరాలుగా నియోజక వర్గానికి ఎంపీగా చేసిన సేవలను వివరిస్తూ 68 పేజీల బుక్‌లెట్‌ను శనివారం విడుదల చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు వీధి వ్యాపారుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నగరంలోని ‘‘రేహ్రీ-పాత్రి’’(వీధి వ్యాపారుల) సర్వేని ప్రకటించారు. వీరికి తమ దుకాణాలను నిర్వహించడానికి స్థలాన్ని అందించేందుకు ఈ సర్వే ఉద్దేశించబడింది. ఈ సర్వే కొన్ని నెలల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత వారికి సరైన పద్ధతిలో స్థలాన్ని అందిస్తామని, తద్వారా ఇతర దుకాణదారులకు, ట్రాఫిక్‌కి సమస్య ఉందని ఆయన ఓ వీడియో సందేశంలో…
60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
PM Modi: లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1తో ముగుస్తాయి, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ వచ్చేంది. ఈసీ 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మేము, బీజేపీ-ఏన్డీయే ఎన్నికలకు…
దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిపారు.