CEO Rajiv Kumar: లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఎన్నికల సంఘం నుంచి వైదొలగాలని మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.శనివారం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన రాజీవ్ కుమార్.. “అరుణ్ గోయెల్ చాలా విశిష్టమైన సభ్యుడు అని, ఆయన వైదొలగడానికి వ్యక్తిగత కారణాలు ఉంటే గౌరవించాలి” అని అన్నారు.
Read Also: Assembly elections: ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే?
అరుణ్ గోయెల్ మార్చి 9న ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ పదవీకాలం 2027లో ముగియనుంది. గోయల్ రాజీనామా తర్వాత, మార్చి 14న జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్‌లుగా నియమితులయ్యారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్భీర్ సింగ్ సంధు, 1988-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారులు. ఇద్దరూ వరుసగా కేరళ, ఉత్తరాఖండ్ కేడర్‌లకు చెందినవారు.
Read Also: Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..
శనివారం ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. .