మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు.. త్రివేంద్ర సింగ్ రావత్ నుంచి బసవరాజ్ బొమ్మై వరకు బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర పెద్దలను లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దింపుతోంది బీజేపీ.
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు.
Election Commissioners: భారత ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు.
Pulwama attack: పుల్వామా దాడిపై కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. పుల్వామా ఘటన కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఆంటోఆంటోనీ వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు 42 మంది జవాన్ల ప్రాణాలనున బలిగొందని ఆయన విలేకరులు సమావేశంలో అన్నారు. పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని చెప్పడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపింది. ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకోకుండా, జవాన్లను ఉద్దేశపూర్వకంగా రోడ్డు మార్గం ద్వారా…
భారత దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవాళ ఉదయం అందజేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3. 4 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే, మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు అర్హులని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
జమిలి ఎన్నికల నిర్వహణ మన దేశంలో ఎంత వరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలను సేకరించిన కోవింద్ కమిటీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిపోర్టును సమర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహాలు రూపొందిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాలను క్రాస్ చేస్తుందని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఢిల్లీలో ఆప్‌తో బీజేపీ పోటీ పడబోతోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో అభ్యర్థుల విషయంలో బీజేపీ కీలకంగా…
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు విడిపోయినట్లు డ్రామాలు ఆడుతున్నాయని, అయితే రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బుధవారం పొల్లాచ్చిలో జరిగిన డీఎంకే సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏఐడీఎంకే తమ పొత్తు చెడిపోయిందని చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని, వారి మధ్య రహస్య సంబంధం ఉందని ఆరోపించారు.