Assembly elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Read Also: Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..
175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 60 మంది సభ్యులు గల అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని ఈసీ శనివారం ప్రకటించింది. సిక్కింలో అసెంబ్లీ ఏప్రిల్ 19న ఒక దశలో జరుగుతుంది. సిక్కింలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని ప్రస్తుత సిక్కిం ప్రభుత్వ పదవీకాలం జూన్ 2024లో ముగుస్తుంది. సిక్కిం అసెంబ్లీలో 32 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒడిశాలో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఒడిశాలో మే 13, మే 20 మే 25, జూన్ 1 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం ప్రకటించింది.
Read Also: Lok Sabha Elections 2024: వెల్లివిరుస్తున్న మహిళా చేతన.. ఈ సారి పోలింగ్ కేంద్రాల్లో అనేక సౌకర్యాలు
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని పోల్ ప్యానెల్ ప్రకటించింది. పోలింగ్ తేదీలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1, జూన్ 4 తేదీల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలు జరగనున్నాయి.