Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి,…
UP Politics: ఇండియా కూటమి తదుపరి సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి ముందు కూడా కూటమిలో తమ సీట్ల విషయంలో అన్ని పార్టీలు రకరకాల వాదనలు చేస్తున్నాయి.
ముందస్తు సార్వత్రిక ఎన్నికలను పిలిచే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పదవీ కాలం చివరి రోజు వరకు భారత పౌరులకు సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు.
Opposition Parties: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు అంటే గురువారం (ఆగస్టు 31) 2 రోజుల ఇండియా కూటమి సమావేశం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు అనధికారిక సమావేశం జరగనుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే విందు ఇవ్వనున్నారు.
మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ నేతృత్వంలో పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు.
Lok Sabha Elections: 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఇప్పటికే రాజకీయ పోరు ప్రారంభించింది. మరోవైపు, కాంగ్రెస్‌తో పాటు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అంటే I.N.D.I.A కింద ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి.
కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. జేడీఎస్ తో పొత్తు లేకుండానే హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీట్లు సాధించేలా చేశారు. సునీల్ కనుగోలు ప్రస్తుతం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యూహకర్తగా వర్క్ చేస్తున్నారు.