Arunacha Assembly Polls: 60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం జూన్ 2తో ముగియనుంది.
2019లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పెమా ఖండూ నేతృత్వంలో బీజేపీ విజేతగా నిలిచింది. ప్రస్తుతం బీజేపీకి అధిక సీట్లు ఉండగా, నేషనల్ పీపుల్స్ పార్టీకి రెండు, కాంగ్రెస్‌కు ఒకటి, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికల కోసం, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అరుణాచల్ వెస్ట్ నుండి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజును, అరుణాచల్ తూర్పు స్థానం నుంచి తపిర్ గావ్‌ను పోటీకి దింపింది. మార్చి 2న ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో రిజిజు, గావో పేర్లు ఉన్నాయి. 2019 జాతీయ ఎన్నికలలో, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 58.2 శాతం ఓటరు శాతాన్ని సాధించగా, కాంగ్రెస్ 20.69 శాతం ఓటరు శాతాన్ని సాధించింది.
Read Also: Assembly elections: ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే?
ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ, జనతాదళ్ (యునైటెడ్) అరుణాచల్ వెస్ట్ నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ రూహి తగుంగ్‌ను పోటీకి దింపాలని నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీ రాష్ట్రంలోని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నైతిక కారణాలను పేర్కొంటూ రాజీనామా చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ పార్టీలకు ఫిరాయించకుండా నిరోధించలేకపోయారు. అలాగే మార్చిలో, తూర్పు సియాంగ్ జిల్లాలోని మెబో నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) నాయకుడు లోంబో తయెంగ్ బీజేపీలో చేరారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ గత నెలలో బీజేపీలో చేరారు.
అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
మార్చి20వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
మార్చి27వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
మార్చి28వ తేదీ : నామినేషన్ల పరిశీలన
మార్చి30వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
ఏప్రిల్ 19వ తేదీ : అరుణాచల్ ప్రదేశ్ పోలింగ్
జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు
అరుణాచల్‌లో తొలి దశలో ఓటింగ్ జరగనుంది.