లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి, ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.
Loksabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంగించారని డీఎంకే ఫిర్యాదులో పేర్కొంది. ‘‘ఎంకే స్టాలిన్ పార్టీ దేవాలయాల నుంచి డబ్బును దొంగిలించి హిందూ మతాన్ని నాశనం చేస్తుంది’’ అని ఆమె ఇటీవల ఆరోపించారు. డీఎంకే పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె…
Lok Sabha polls: విడిపోయిన మిత్రులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400కి పైగా సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఏన్డీయే కూటమి, అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తో్ంది. పాత మిత్రులను అక్కున చేర్చుకుంటోంది. ఇప్పటికే పాత మిత్రలైన తెలుగు దేశం పార్టీ, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలు ఏన్డీయేలోకి చేరాయి.
PM Modi: ఇండియా కూటమి నేతలు ఉద్ధేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యాడు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ప్రతీ ఒక్కరూ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్తించారు.
Raj Thackeray: మహారాష్ట్ర పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ ప్లాన్ సిద్ధం చేసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్, ఉద్ధవ్ ఠాక్రే కజిన్ రాజ్ ఠాక్రేని రంగంలోకి దించింది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు ఖరారైందనే…
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనతో రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్‌గా మారాయి. ఎన్నికల ప్రకటన తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కూడా యాక్టివ్‌గా మారింది.