PM Modi: పెద్ద పండగ వచ్చింది.. బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1తో ముగుస్తాయి, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ వచ్చేంది. ఈసీ 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మేము, బీజేపీ-ఏన్డీయే ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయ్యాము. మా ట్రాక్ రికార్డ్ ఆధారంగా మేము ప్రజల వద్దకు వెళ్తాము. అన్ని రంగాల్లో మేము సుపరిపాలన అందించాము’’ అని ఆయన అన్నారు.
Read Also: Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన
Also Read
పదేళ్ల క్రితం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారత్‌లోని ప్రజలు ఇండి కూటమి దయనీయ పాలనకు బలయ్యారు, ప్రజలు ద్రోహం, భ్రమలకు లోనయ్యారని, అన్ని రంగాల్లో అవినీతి చోటు జరిగిందని, ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టలేదని ఆయన ప్రతిపక్షాలపై ఆరోపించారు. ప్రతిపక్షాలు చుక్కాని లేని విధంగా ఉన్నాయని, వారు చేయగలిగిందల్లా మమ్మల్ని తిట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే అని ఆరోపించారు. వారి కుటుంబ రాజకీయాలు, సమాజాన్ని విభజించే వైఖరిని అంగీకరించడం లేదని, ప్రజలు ఇలాంటి నాయకత్వాన్ని కోరుకోరని ప్రధాని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి 543 స్థానాలకు గానూ ఈ సారి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మా మూడో టర్మ్‌లో చేయాల్సిన పని చాలా ఉందని, గత 70 ఏళ్లు పాలించిన వారి ద్వారా ఏర్పడిన ఖాళీని ఈ 10 ఏళ్లలో భర్తీ చేశామని అన్నారు. రాబోయే ఐదేళ్లు వెయ్యేళ్ల దేశ సర్వతోముఖాభివృద్ధికి, ప్రపంచ నాయకత్వానికి బాటలు వేస్తుందని ప్రధాని అన్నారు.
The biggest festival of democracy is here! EC has announced the 2024 Lok Sabha election dates. We, the BJP-NDA, are fully prepared for elections. We are going to the people on the basis of our track record of good governance and service delivery across sectors.…
— Narendra Modi (@narendramodi) March 16, 2024
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!