తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కె మాధవి లతకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును ఎత్తమని కోరారని దీనపై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు. అమృత విద్యాలయంలో స్వయంగా ఓటు వేసిన…
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్తాన్ అణుశక్తికి బయపడే పిరికివాళ్లు’’గా అభివర్ణించారు.
తెలంగాణ వ్యాప్తంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత ముస్లిం మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోడీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 2025తో మోడీ 75 ఏళ్లు నిండుతాయని,…
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ -31.51, భువనగిరి -27.97, చేవెళ్ల -20.35, హైదరాబాద్-10.70, కరీంనగర్-26.14, ఖమ్మం-31.56, మహబూబాబాద్-30.70, మహబూబ్‌నగర్-26.99, మల్కాజిగిరి-15.05, మెదక్-28.32, నాగర్ కర్నూల్ -27.74, నల్గొండ-31.21, నిజామాబాద్-28.26, పెద్దపల్లి-26.17, సికింద్రాబాద్-15.77, వరంగల్-24.18, జహీరాబాద్-31.83 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 16.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. భద్రాద్రి…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికలు రానేవచ్చాయి. తెలంగాణ, ఏపీతో పాటు 10 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తెలంగాణలో నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తుండటంతో అక్కడక్కడ పోలింగ్ ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదర్కొన్నారు. వర్షాల వల్ల నిన్న, మొన్న చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని సీఈఓ వికాస్ రాజ్…
Sonia Gandhi : దేశంలోని 96 లోక్‌సభ స్థానాలకు నాల్గవ దశలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. నాల్గవ దశ ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన వీడియో సందేశం ఇచ్చారు.