ఉదయం నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92…
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఓటేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి మాట్లాడారని ఆయన విమర్శించారు.