తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ -31.51, భువనగిరి -27.97, చేవెళ్ల -20.35, హైదరాబాద్-10.70, కరీంనగర్-26.14, ఖమ్మం-31.56, మహబూబాబాద్-30.70, మహబూబ్‌నగర్-26.99, మల్కాజిగిరి-15.05, మెదక్-28.32, నాగర్ కర్నూల్ -27.74, నల్గొండ-31.21, నిజామాబాద్-28.26, పెద్దపల్లి-26.17, సికింద్రాబాద్-15.77, వరంగల్-24.18, జహీరాబాద్-31.83 శాతం పోలింగ్ నమోదైంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 16.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి శ్రీకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూనగర్ పోలింగ్ బూత్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.