Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గత ఎన్నికల్లో కంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం 3.00 గంట వరకు పోలింగ్ 62.44 శాతం నమోదైనట్లు తెలిసింది.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
Read Also:Patient On Stretcher Voted: స్ట్రెచర్ పై పోలింగ్ బూత్‌కి వెళ్లి మరీ ఓటు వేసిన మహిళ..
లోక్‌సభ నియోజక వర్గాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా..
*ఆదిలాబాద్ -62.44 శాతం
*భువనగిరి -62.05 శాతం
*చేవెళ్ల -45.35 శాతం
*హైదరాబాద్ -29.47 శాతం
*కరీంనగర్-58.24 శాతం
*ఖమ్మం-63.67 శాతం
*మహబూబాబాద్-61.40 శాతం
*మహబూబ్నగర్-58.92 శాతం
*మల్కాజిగిరి-37.69 శాతం
*మెదక్-60.94 శాతం
*నాగర్ కర్నూల్ -57.17 శాతం
*నల్గొండ-59.91 శాతం
*నిజామాబాద్-58.70 శాతం
*పెద్దపల్లి-55.92 శాతం
*సికింద్రాబాద్-34.58 శాతం
*వరంగల్-54.17 శాతం
*జహీరాబాద్-63.96 శాతం
*సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం..39.92 శాతం ఓటింగ్ నమోదు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!