Amit Shah: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగులుతోంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం హోం మంత్రి అమిత్ షా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. ఐదో విడత మే 20న జరగనుంది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు.
మంత్రి అంబటి రాంబాబు ఏపీ ఎన్నికల అధికారి(సీఈవో) ఎంకే మీనాను కలిశారు. పల్నాడులో పొలిటికల్ హింస మీద ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని.. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. ఓటర్లు బస్సులు, ఫ్లైట్‌లు, రైళ్లలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా జనం ఓటేశారు. పలు చోట్ల హింసాత్మక దాడులకు కూడా భయపడకుండా ఏపీ ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును ఈవీఎం బాక్సులలో నిక్షిప్తం చేశారు.
వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు.
తెలంగాణలో నిన్న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసుందకు ముందుకు వచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రెండు గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ జరిగి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణలోని ఆ రెండు గ్రామాల ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయిలో…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు.
ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.