CM Revanth Reddy : ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోడీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 2025తో మోడీ 75 ఏళ్లు నిండుతాయని, ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలన్నారు సీఎం రేవంత్. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన వెల్లడించారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏ కు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని, బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోడీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని, దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా..’సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదు. దేశ ప్రజలకు మోడీ మాయమాటలు చెబుతున్నారు. ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే… మోడీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది.. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోంది.. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధం.. దేశంలో మోడీ వ్యతిరేక వేవ్ నడుస్తోంది. మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు… నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవు.. బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదు.. కానీ ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగింది.. ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనం.. బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా? కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోడీని ఒక్కటే అడుగుతున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి.. మోడీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు..
Also Read
- Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదు.. పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం.. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది.. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు.. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారు.’ అని సీఎం రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
-
CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
-
Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!