లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై రాచకొండ పోలీసులు 14 కేసులు నమోదు చేశారు. కమిషనరేట్‌లో ప్రేరేపణ, నగదు, మద్యం, డ్రగ్స్, ఫ్రీబీస్ తదితర రవాణాను అరికట్టేందుకు కమిషనరేట్‌లో 29 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 25 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు పనిచేస్తున్నాయని, ఎనిమిది అంతర్‌జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఓటర్లలో విశ్వాసం నింపేందుకు, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 114 ఫ్లాగ్…
PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు.
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు డీజీపీ రవి గుప్తా. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలని సూచించారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లోక్‌సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసామని ఆయన వెల్లడించారు.…
Amit Shah: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, వారితో సఖ్యతగా వ్యవహరించాలి,
ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్న సిబ్బంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కరీంనగర్ లోకసభ స్థానం పరిధిలో 17 లక్షల 97 వేల150 మంది ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీయే తనను మోసం చేసిందని.. నాకు మోసం చేసింది.. సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ పేర్కొన్నారు. కాం తాను పార్టీకి ద్రోహం చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.