Madras High Court: టీనేజ్ ప్రేమని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు చెప్పింది. జస్టిన్ ఎన్ ఆనంద్ వెంకటేష్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 4 నాటి ఉత్తర్వుల్లో.. యువకుడు, యువతి మధ్య శారీరక సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయ సంబంధంలో సహజమైన పరస్పర చర్య అని తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) ప్రకారం ఇది నేరానికి…
Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
High Court: క్రూరత్వానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. తన చనిపోయిన భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి అభియోగాలు ఎదుర్కొన్నాడు.
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదులోపలన జైశ్రీరాం అని అరవడం ఏ తరగతి మనోభావాలను , మత భావాలను ఉల్లంఘించలేదు అని పేర్కొంది. మసీదులో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై మత విశ్వాసాలను అవమానపరిచారని నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని కోర్టు రద్దు చేసింది.
Allahabad HC: ఒక వ్యక్తిపై భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపుల ఆరోపణల్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపబ్టింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆమె ఆరోపణలు చేసిందని కోర్టు భావించింది. మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు మహిళ ఆరోపణల్ని కొట్టిపారేసింది. వరకట్న వేధింపులతో పాటు తన భర్త అసహజ సెక్స్‌కి బలవంతంగా చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలు అన్నింటి కోర్టు కొట్టివేసింది.
Kerala High Court: కేరళ మాజీ ఆర్థిక మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు, ఓ యువతి షరియా చట్టాన్ని ఉల్లంఘించిందని, ఆమె అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసులు రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఏ మత విశ్వాసం కూడా రాజ్యాంగానికి అతీతం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది.
Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది.
Allahabad HC: ‘‘ఉత్తర్ ప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టాన్ని’’ అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది. భారత లౌకిక స్పూర్తికి ఇది నిదర్శమని చెప్పింది. ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి, దేశ లౌకిక స్వరూపాన్ని నిలబెట్టడానికి అవసరమని కోర్టు పేర్కొంది.
MP High Court: భార్యభర్తల విధులు, ఇంట్లో పనుల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య సమయానికి వంట చేయకపోవడం, భర్తని ఇంటి పనులు చేయమనడం, బట్టలు ఉతకమనడం ఆత్మహత్యకు ప్రేరేపిత కారణాలు కావని, ఈ సమస్యలు సామాన్యమైనవని,