Madras High Court: ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం..
- ప్రేమలో ఉన్న యువత ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం సహజం..
- లైంగిక వేధింపుల కేసుని కొట్టేసిన మద్రాస్ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: టీనేజ్ ప్రేమని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు చెప్పింది. జస్టిన్ ఎన్ ఆనంద్ వెంకటేష్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 4 నాటి ఉత్తర్వుల్లో.. యువకుడు, యువతి మధ్య శారీరక సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయ సంబంధంలో సహజమైన పరస్పర చర్య అని తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) ప్రకారం ఇది నేరానికి అర్హమైనంది కాదని పేర్కొంది.
ఏకాంత ప్రదేశంలో జరిగిన మీటింగ్‌లో తనతో ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తి, తనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడని ఆరోపిస్తూ 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఐపీసీ 354-A(1)(i) కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నమ్మించి లైంగికంగా వాడుకోవడం, శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం వంటివి క్రిమినర్ నేరంగా పరిగణిస్తాయి.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
Read Also: తమ భార్యల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ క్రికెటర్లు వీళ్లే..
అయితే, తాజా కేసులో ఈ సెక్షన్ కింద క్రిమినల్ నేరంగా పరిగణించే అంశాలు లేవని కోర్టు గుర్తించింది. ఇద్దరు కూడా యుక్తవయసు చివరిలో ఉన్నారరని, ఇష్టపూర్వకంగా కలుసుకున్నారని, కలిసి గడిపారని కోర్టు పేర్కొంది. ఆరోపించిన చర్యలు ఏదైనా నేరపూరిత ఉద్దేశ్యం కన్నా, యువ జంట యొక్క విలక్షణమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయని జస్టిస్ వెంకటేష్ పేర్కొన్నారు. “టీనేజ్‌లో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం చాలా సహజం. ఇది IPC సెక్షన్ 354-A(1)(i) ప్రకారం నేరంగా పరిగణించబడదు.” అని చెప్పారు.
ఇలాంటి కేసులను కొనసాగించడం వల్ల ఏకాభిప్రాయంతో సంబంధాలు పెట్టుకునే యువతపై అనవసరమైన కళంకం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసి శ్రీవైగుండం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కి తుది నివేదిక సమర్పించిన తర్వాత కోర్టు జోక్యం చేసుకుంది. హైకోర్టు తన అధికార పరిధిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 482 ప్రకారం ఉపయోగించుకుంది, ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయడానికి అనుమతిస్తుంది. ఒక కేసు విచారణకు వచ్చినప్పటికీ, వాటిని కొనసాగించడం వల్ల అన్యాయం జరుగుతుందని, విచారణ రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!