Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..
- భర్త వేరే మహిళతో సహజీవనం చేసినా అది గృహహింసనే..
- భార్యకు మెయింటనెన్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిందే..
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. నివేదికల ప్రకారం.. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ పిటిషన్‌ని కొట్టేస్తూ ఈ తీర్పు చెప్పారు. మానసిక వేధింపులు, రూ. 3 లక్షల పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ. 30,000 సహా, భార్య గాయాలకు నష్టపరిహారంగా రూ. 5 లక్షలు ఇవ్వడాన్ని భర్త సవాల్ చేశాడు.
ఈ జంటకు 1998లో వివాహం జరిగింది. తన భర్త తనను మాసిసికంగా మాటలతో, శారీరకంగా వేధించాడని భార్య ఫిర్యాదు చేసింది. భర్త 2010లో వేరొక మహిళని ఇంటికి తీసుకువచ్చి, తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వీరిద్దరికి అప్పటికే సంబంధం ఉంది. భార్యతో కలిసి ఉండటం మానేశాడు. తన అత్తమామలు బెదిరించడంతో పాటు, సదరు మహిళపై చర్యలు తీసుకుంటే తనకు, తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం మానేస్తానని భర్త హెచ్చరించినట్లు భార్య తెలిపింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కూతురు కూడా ఉందని ఆరోపించింది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు
పరిహారం ఇవ్వడానికి నిరాకరించిన భర్త అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. భార్య ఫిర్యాదు గృహహింస చట్టం పరిధిలోకి రాదనే అతడి వాదనతో విభేదించింది. భర్త వేరే మహిళతో కలిసి జీవించాన్ని సహించలేకే భార్య తన వైవాహిక ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. పరిస్థితులను బట్టి తన పిల్లలతో కలిసి, భర్త అత్తామామలను వదిలేయడం తప్పితే భార్యకు వేరే మార్గం లేదని, ఆమె చర్యల్ని కోర్టు సమర్థించింది.
ఈ కేసులో భార్యకు నెలకు ఖర్చుల కోసం రూ. 30,000 ఇవ్వాలని, భార్య సంపాదించగల సామర్థ్యాన్ని దీనికి వ్యతిరేకంగా చూపొద్దని, భార్య పనిచేస్తుందా..? లేదా..? అనే దానితో సంబంధం లేకుండా తన భార్య, పిల్లల పోషించడం భర్త బాధ్యత అని కోర్టు పేర్కొంది. చాలా మంది భారతీయ మహిళలు తమ కుటుంబాలు, పిల్లలు, అత్తమామల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను కూడా వదిలేస్తున్నారని కోర్టు పేర్కొంది. తన భార్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని భర్త చేసిన వాదన మహిళలందర్ని అవమానించడమే అని పేర్కొంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!