Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సె*క్స్ చేసినా అత్యాచారమే..
- ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సె*క్స్ చేసినా అది అత్యాచారమే..
- 18 ఏళ్ల లోపు భార్యతో శృంగార సంబంధం రేప్ కిందకే వస్తుంది..
- బాంబే హైకోర్టు కీలక తీర్పు, నిందితుడికి 10 ఏళ్లు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సెక్స్ చేసిన అది అత్యాచారంగానే పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి చర్యలకు సంబంధించిన చట్టపరమైన రక్షణ చట్టం అంగీకరించదని చెప్పింది. తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉందని పేర్కొంటూ, న్యాయమూర్తి జిఎ సనప్‌తో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగా పరిగణించాల్సిందే అని, ఆమెని వివాహం చేసుకున్నా, లేకున్నా సంబంధం లేదని చెప్పింది.
భార్య లేదా భార్యగా చెప్పబడుతున్న అమ్మాయి వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నప్పుడు భార్యతో ఏకాభిప్రాయ శృంగారం చేశామంటే రక్షణ చట్టాలు అందుబాటులో ఉండవని హైకోర్టు నొక్కి చెప్పింది. కింది కోర్టు విధించిన 10 ఏళ్ల శిక్షను హైకోర్టు సమర్థించింది. కేసు వివరాల ప్రకారం.. వ్యక్తి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు, ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. అయితే, వీరిద్దరి వివాహ సంబంధం చెడిపోవడంతో భార్య సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
వారిద్దరి మధ్య పెళ్లి జరిగినప్పటికీ.. ఆ వ్యక్తి ఆమె సమ్మతికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు చేసిన ఆరోపణల్ని దృష్టిలో పెట్టుకున్న కోర్టు, అది అత్యాచారం అని పేర్కొంది. ప్రస్తుతం బాధితురాలు మహారాష్ట్ర వార్ధాలో ఆమె తండ్రి, సోదరీమణులు, అమ్మమ్మతో కలిసి నివసిస్తోంది. బాధితురాలు ఈ పరిణామం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆమెకు 3-4 ఏళ్లు నిందితుడైన వ్యక్తితో శృంగార సంబంధం ఉంది.
Read Also: Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన అన్షుల్ కాంబోజ్
కుటుంబ పరిస్థితుల కారణంగా సమీపం పట్టణానికి వలస వచ్చిన అమ్మాయిని, నిందితుడు అనుసరించాడు. ఆమెని పికప్ డ్రాప్ చేసేవాడు. చివరకు ఆమెను లైగింకంగా వాడుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. మొదట్లో నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. నిందితుడు తన ఇరుగుపొరుగు సమక్షంలో అద్దె ఇంటిలో ఆమెకు శ్రీమంతం చేశాడు. ఆ తర్వాత నుంచి అమ్మాయిపై శారీరక దాడులు చేయడం ప్రారంభించాడు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమెకు పుట్టబోయే బిడ్డ వేరే వ్యక్తి వల్ల కలిగిందని ఆరోపించాడు.
వేధింపులు తట్టుకోలేక బాధితురాలు 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. తమ లైంగిక సంబంధం అంగీకారంతోనే జరిగిందని నిందితుడు ఆరోపించాడు. ఈ కేసులో నేరం జరిగిన సమయంలో బాధితురాలి వయసు 18 ఏళ్ల కన్నా తక్కువగా ఉందని కోర్టు నిర్ధారించింది. డీఎన్ఏ నివేదిక కూడా పుట్టిన బిడ్డ వీరిద్దరికే పుట్టినట్లు కోర్టు నిర్ధారించింది. కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!