High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Judge: విడిపోయిన భార్యాభర్తల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న సెషన్స్ కోర్ట్ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జడ్జి సదరు మహిళను ఉద్దేశించి, ఆమెకు ‘‘బొట్టు’’, ‘‘మంగళసూత్రం’’ ధరించడం లేదని, మీ భర్తకు మీపై ఎందుకు ఆసక్తి చూపిస్తాడు..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూణేకి చెందిన వివాదాలను వాదించే లాయర్ అంకుర్ ఆర్ జహంగీర్ దీని గురించి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. గృహహింస కేసులో సదరు జంట న్యాయమూర్తి ముందు హాజరయ్యారని జహంగీర్ తెలిపారు. వివాదాన్ని…
Bombay High Court: ఏ తల్లీ తన సొంత బిడ్డను కొట్టదు అని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఏడేళ్ల కొడుకుపై దాడి చేసినందుకు తల్లితో సహా ఆమె భాగస్వామిపై కేసు నమోదై, అరెస్ట్ చేయబడ్డారు. అయితే, తాజాగా ఈ కేసులో బాలుడి తల్లి అయిన 28 ఏళ్ల మహిళకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
MP High Court: ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది.
High Court: భర్త కాకుండా, వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని జస్టిస్ అహ్లువాలియా తీర్పు చెప్పారు. కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ, ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Allahabad HC: లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తన గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునే హక్కును చట్టం కల్పిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కామెంట్స్ చేసింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు గర్భాన్ని వైద్యపరంగా తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.
Delhi court: బహిరంగంగా ‘‘పొట్టి దుస్తులు’’ ధరించడం నేరం కాదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. గత ఏడాది బార్‌లో అశ్లీల నృత్యం చేసినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురు బార్ డ్యాన్సర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చిన కోర్టు.. డ్యాన్స్ వల్ల ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది.
High Court: భర్త తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య నిర్లక్ష్యంగా ఆరోపించడం మానసిక క్రూరత్వానికి సమానమే అని కలకత్తా హైకోర్టు చెప్పింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహాన్ని, నేటి సమాజంలో అక్రమ సంబంధంగా భావించలేము అని కోర్టు పేర్కొంది. క్రూరత్వం కారణంగా కుటుంబ కోర్టు తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించడంతో భర్త (పిటిషనర్) హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుని విచారిస్తూ, హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సహోద్యోగితో వివాహేతర సంబంధం ఉందంటూ…
Delhi High Court: లైంగిక చర్యలకు మహిళ అంగీకరించినప్పటికీ, ఆమె వీడియోలు, తీయడం నేరమే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లైంగిక చర్యల్లో పాల్గొనడానికి ఒక మహిళ అంగీకరించడాన్ని ఆమె అనుచిత వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అంగీకారంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది.
Supreme Court: కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తల్లి ఒప్పుకోకపోవడం అనేది, అతడిని ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యను ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తన ప్రేమికుడిని వివాహం చేసుకోకుండా జీవించలేదని, ఆత్మహత్యకు పాల్పడటం, సదరు అమ్మాయిన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.