Live-in-relationship:‘‘లిన్- ఇన్ రిలేషన్’’లపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఒక భాగస్వామికి అప్పటికే పెళ్లయి, విడాకులు తీసుకోనట్లయితే, సహజీవనంలో ఉన్న వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోరలేరని తీర్పు చెప్పింది. లివ్-ఇన్‌లో ఉంటున్న ఒక జంట రక్షణ కోరిన తర్వాత, రక్షణ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డిసెంబర్ 16న ఈ కేసుపై న్యాయమూర్తి వివేక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సంపూర్ణం కాదని, అది అప్పటికే ఉన్న జీవిత భాగస్వామి చట్టబద్ధ హక్కులను ఉల్లంఘించకూడదని…
Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది.
High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.
Kissing: బ్యాంకు మహిళా ఉద్యోగిపై అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు రూ. 1000 జరిమానా విధించడంతో పాటు ఒక ఏడాది కఠిన జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ముంబైలోని బోరివలిలో జరిగింది. 2020లో అధికారిక చిరునామాను ధ్రువీకరించేందుకు నిందితుడి నివాసానికి వచ్చిన, మహిళా ఉద్యోగిని పట్ల 54 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. Read Also: Hyderabad: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. బీర్ బాటిల్స్ తో దాడి.. చనిపోయాడనుకొని.. నరేంద్ర రఘునాథ్ సగ్వేకర్ అనే…
Bombay High Court: వివాహం తర్వాత భర్తతో ‘‘శృంగారానికి’’ నిరాకరించడం కూడా విడాకులకు కారణం కావచ్చని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇది భర్త పట్ల క్రూరత్వానికి సమామని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, భార్య పిటిషన్‌ని కొట్టేసింది. భర్తతో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం, అతనితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం విడాకులకు కారణం కావచ్చని హైకోర్టు పేర్కొంది.
Supreme Court: వైవాహిక వివాద కేసులో జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డ్ చేయడం ఆమోదయోగ్యమైన సాక్ష్యమని సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో తీర్పు చెప్పింది. జీవిత భాగస్వామి టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందని, కుటుంబ కోర్టులో సాక్ష్యంగా అంగీకరించలేమని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
Bombay High Court: తన భార్య వ్యభిచారానికి పాల్పడుతుందనే అనుమానంతో ఆమె కుమారుడికి డీఎన్ఏ పరీక్ష చేయించడం సరైంది కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలుడి తండ్రిని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలన్న ఫ్యామిలీ హైకోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్ఎం జోషి, జూలై 1న ఇచ్చిన తన తీర్పులో.. ‘‘డీఎన్ఏ పరీక్షను చాలా అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ఆదేశించగలం. కేవలం ఒక వ్యక్తి భార్య వ్యభిచారంలో ఉందని…
High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు…
Madras High Court: నిందితులు పదే పదే కస్టడీలో జారిపడి గాయాలపాలవుతున్నారనే పోలీసులు వాదనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తీరును ప్రశ్నించింది. తన కుమారుడు జాకీర్ హుస్సేన్కు సరైన వైద్య చికిత్స కోరుతూ కాంచీపురానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, వి లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం విచారించింది.
Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు.