Madhya Pradesh HC: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్ షిప్‌పై సంచలనాత్మక తీర్పును వెల్లడించింది. చట్టబద్ధంగా వివాహం కాకున్నా, పురుషుడితో చాలా కాలం పాటు జీవించిన స్త్రీకి, విడిపోయిన తర్వాత భరణం పొందేందుకు అర్హురాలే అని తీర్పునిచ్చింది.
Patna High Court: అసభ్యకరమైన భాషలో తిట్టుకున్న భార్య, భర్తల కేసులో పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యని ‘భూతం’, ‘పిశాచి’ అని పిలువడం క్రూరత్వం కిందకు రాదని కోర్టు పేర్కొంది.
Family Court: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళను తక్షణమే భర్త ఇంటికి తిరిగిరావాలని కోరింది. ఆచారబద్ధమైన సింధూరం ధరించడం హిందూ స్త్రీ విధి అని.. అది పెళ్లయినట్లు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. తన భార్య పెళ్లైన ఐదేళ్ల తర్వా తవెళ్లిపోయిందని, హిందూ వివాహ చట్టం కింద తన హక్కులను పునరుద్ధరించాలని కోరతూ ఓ వ్యక్తి ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రిన్సిపల్ జడ్జ్…
Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్‌నర్లను మార్చడం "నైతికం"గా సరికాదు, కానీ రిలేషన్‌షిప్‌లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.
Supreme Court: ఒక కుటుంబంలో జీతం తీసుకువచ్చే ఉద్యోగి ఎంత ముఖ్యమో, గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబాన్ని చూసుకునే స్త్రీ విలువ చాలా ఉన్నతమైందని, ఆమె పని అమూల్యమైనదని పేర్కొంటూ.. ఆమె సేవల్ని డబ్బుతో లెక్కించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మోటార్ ప్రమాదం కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచింది.
Domestic Violence: తన భర్త, అత్తామామలపై భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేసింది. మహిళ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి తన తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబడదని చెప్పింది. అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి కోర్టు) ఆశిష్ అయాచిత్, మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో.. మహిళ ఫిర్యాదు అస్పష్టంగా…
Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు తమ అల్లుడిపై కేసు పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారించింది. అల్లుడిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటికీ సమాజపు చీకట్లను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. తమ పిల్లల ఆమోదం లేకుండా చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకిస్తూ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి వెళ్లే తల్లిదండ్రులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం…
Bombay High Court: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి, తన ప్రేమికుడిపై వేసిన పిటిషన్ని బాంబే హైకోర్ట్ నాగ్పూర్ బెంచ్ కొట్టేసింది. ఈ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా తామిద్దరం పెళ్లి చేసుకుంటామనే ఆలోచన మేరకే శృంగారంలో పాల్గొన్నామని, అయితే, తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చిందని సదరు యువకుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు.