Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
- భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
- సెక్షన్ 306 ఐపీసీ కింద నేరాన్ని ఆకర్షించలేము..
- ఎఫ్ఐఆర్‌ని రద్దు చేసిన గుజరాత్ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది. మహిళ, ఆమె భాగస్వామిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని హైకోర్టు కొట్టేసింది. తన కొడుకు మరణానికి అతడి భార్య వివాహేతర సంబంధమే కారణమని ఆరోపిస్తూ మృతుడి తల్లి కేసు పెట్టింది. అయితే, ఎఫ్ఐఆర్‌లోని విషయాలు నిజమని అంగీకరించినప్పటికీ, మరణించిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించే ఉద్దేశం సదరు మహిళకు ఉందని నిర్దారించలేదని హైకోర్టు పేర్కొంది.
Read Also: Daisuke Hori: 12 ఏళ్లుగా.. రోజుకు 30 నిమిషాలే నిద్ర.. ఫిట్ నెస్ మాత్రం అదుర్స్..
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
జస్టిస్ దియేష్ ఏ జోషితో కూడిన సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మృతుడి భార్యకు ఆత్మహత్యకు ప్రేరేపించే ఉద్దేశం ఉందని చెప్పలేమని, కాబట్టి ఈ కేసులో సెక్షన్ 306 IPC కింద నేరాన్ని ఆకర్షించలేమని చెప్పారు. కేవీ ప్రకాస్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక కేసుని గుజరాత్ హైకోర్టు ప్రస్తావించింది. వివాహేతర సంబంధం అనేది తప్పనిసరిగా సెక్షన్ 306 ఐపీసీ ప్రకారం నేరారోపణకు దారి తీయదనే సుప్రీంకోర్టు తీర్పును పేర్కొంది. ఇది విడాకులు లేదా ఇతర వైవాహిక ఉపశమనాలకు దారి తీయెచ్చని చెప్పింది.
సెక్షన్ 306 ఐపీసీ ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే, అలాంటి ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించినా, ఎవరు సహకరించినా పదేళ్ల వరకు పొడగించబడే జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది. ‘‘మరణించిన వ్యక్తి తల్లి బాధను మేం అర్థం చేసుకుంటాం. వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. కోర్టు సానుభూతి మరియు ఫిర్యాదుదారు బాధను చట్టబద్ధంగా అనువదించలేము.’’ అని ఎఫ్ఐఆర్‌ని రద్దు చేస్తూ కోర్టు తీర్పుచెప్పింది.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!