కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్‌బీఆర్ఎఫ్ నిధులకు..
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడిగా చేర్చారు. రియాల్టర్ చక్రధర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు…
కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… " కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు.
ప్రజలను ఫైబర్ మోసాల నుంచి కాపాడడం తమ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేంద్ర అన్నారు. HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయని.. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రంలో దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. చాలామంది అమాయకులు మోస పోతున్నారన్నారు.
భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు.
మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ. ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు.. టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. కాగా.. తాజాగా కుంభమేళాలో స్నానమాచరించిన భక్తుల సంఖ్యను యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 55 కోట్ల మంది మహా కుంభమేళాలో స్నానం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ కలిసిన విషయం తెలిసిందే. విజయవాడలో మాజీ సీఎంను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ నటుడు, టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు మనోజ్‌కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మనోజ్ కూడా సంతోషం వ్యక్తం…
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, రాజమండ్రి శ్రీదేవి ప్రధాన పాత్రల్లో సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. శశి వంటిపల్లి నిర్మించారు. కేదార్ శంకర్, ప్రమోదినీ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు. గతంలో ఈ చిత్ర టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.…
ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది.