ప్రజలను ఫైబర్ మోసాల నుంచి కాపాడడం తమ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయని.. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రంలో దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. చాలామంది అమాయకులు మోస పోతున్నారన్నారు.
సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ కి 14 రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్, నిపుణులు రావడం సంతోషంగా ఉందని డీజీపీ జితేందర్ తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యతాయుతంగా కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో నడపాలంటే సైబర్ నేరాల అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. డిజిటల్ భద్రత, భవిష్యత్తుపై సైబర్ సెక్యూరిటీ షెల్డ్ మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని.. ప్రైవేట్ బ్యాంక్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కమ్యూనికేషన్ ఏజెన్సీస్ టెలికం సిస్టం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటీపీ, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ అకౌట్స్ హ్యాకింగ్, ఆన్లైన్ ట్రజెక్షన్స్ ఫ్రెండ్స్, పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సైబర్ నేరాల గురించి ప్రజల్లో మరింత చైతన్యం నింపాలని సూచించారు.
READ MORE: KCR: బాంబు పేల్చిన కేసీఆర్.. ఉపఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి..