ఫిబ్రవరి20 వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. వారికి స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? తెలంగాణ క సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. చిట్టిల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర నట్టేట ముంచినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్ సీ టైప్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఈ మోసానికి పాల్పడ్డాడు.
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్‌ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం…
రివోల్ట్ మోటార్స్ భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని విస్తరించింది. కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ (Revolt RV BlazeX) ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్‌వీ1 కంటే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది.
రేపు మహా శివరాత్రి పర్వం.. హిందువులకు ఇదో పెద్ద పండుగ. జాగారాలు, ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. కొందరు వృత్తి రీత్యా హైదరాబాద్‌కి వచ్చి శివరాత్రికి ఇంటికి వెళ్ల లేక పోతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం, పట్నంకి దగ్గర్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. రేపే (ఫిబ్రవరి 26)న మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కాగా.. శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం...
మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు.
రేపే మహా శివరాత్రి. శివుని ఆరాధించే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. శివరాత్రి అంటే శివుని ఆరాధనలో ఉపవాసం, జాగారం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం. శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేసి శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
రేపే మహా శివరాత్రి. ఇది పరమేశ్వరుడి భక్తులందరికీ అత్యంత ఇష్టమైన రోజు. అంతే కాకుండా జ్యోతిష్య ప్రకారం కూడా చాలా కీలకం. ఉచ్ఛ స్నథితిలో శుక్రుడు, మీన రాశిలో బుధుడు, వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభ రాశిలో రవి, శని రాశులు మహా శివరాత్రి నుంచి సంచారం చేయనున్నాయి. ఈ రోజున భక్తులు శైవ క్షేత్రాలకు పరుగులు తీస్తుంటారు. శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. కానీ.. శివుడి పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలట. అవేంటో ఇప్పుడు…