అందాల ఇలియానా ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఇలియానా. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే ఇలియానా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ను రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఇద్దరూ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
షడ్రుచులలో ఒకటి ఉప్పు . భారతీయ వంటకాలలో ఉప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆహార పదార్ధాలకు రుచిని ఇస్తుంది. అంతేకాదు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు తప్పనిసరిగా కావాల్సిందే. అయితే ఉప్పుని ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. ఉప్పు ఖరీదు పదుల్లో ఉంటుంది.
టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తన కుమారుల్లో ఒకరికి ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టారు. తన కొడుకు పేరులో భారతీయ శాస్ర్తవేత్త ‘చంద్రశేఖర్’ను చేర్చారట. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 2023లో వెల్లడించారు. కెనడాకు చెందిన శివోన్ అలీసా జిలిస్‌తో కలిగిన కవలల్లోని ఒక కుమారుడి మధ్య పేరు ‘చంద్రశేఖర్’గా పెట్టినట్లు ఎలాన్ మస్క్ తనతో చెప్పినట్లు రాజీవ్ వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో గుర్రంపై స్వారీ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా మరణించాడు. పెళ్లి మండపం దుఃఖంగా మారింది. వధూవరుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వధువు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రం, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బద్రికి సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే... ఈ సినిమాలో "హే చికితా” అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో సంచలన సృష్టించిన ఈ పాట ఇప్పుడు ప్లే చేసినా.. స్టెప్పులేయాల్సిందే.. కాగా.. ఇప్పుడు "హే చికితా” సినిమా రూపంలో వస్తోంది. పవన్ కళ్యాణ్ పాట అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ ,'గరుడవేగ'…
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అది ముగిసిన వెంటనే, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ లీగ్ అంటే ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారిగా రూ.262 కోట్లకు పైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించలేదు. లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్‌వర్క్ విస్తరణ, తక్కువ ధరలకు సేవలను అందించడం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు.
యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ఎంతో కీలకమైన కలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించారు. బాలివుడ్‌లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పంకజ్ దగ్గరయ్యారు.
తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం హైడ్రా అక్రమ కట్టడాలను తొలగించింది. కోమటికుంట ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడింది.. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది.