Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్
- టెహ్రాన్ బంకర్లపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు దాడులు
- ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఎటాక్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం రోజురోజుకు పెరిగిపోతుంది. దాడులు-ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. తాజాగా అయతుల్లా అలీ ఖమేనీ కోసం నిర్మించిన భూగర్భ బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మొసాద్ సాయంతో 50 ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు టెహ్రాన్ బంకర్లపై నరకాగ్నిని కురిపించాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్, మొసాద్ సంయుక్తంగా సమర్థవంతమైన సమన్వయంతో దాడులు నిర్వహించిట్లుగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ఇది కూడా చదవండి: Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర
ఈ బంకర్‌ను యుద్ధ సమయంలో తన పర్యవేక్షణ కోసం ఉపయోగించుకొనేందుకు ఖమేనీ నిర్మించారు. ప్రస్తుతం ఖమేనీ మరణం తర్వాత ఈ భవనాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారులు ఉపయోగిస్తున్నారు. ఈ బంకర్‌ను ఇరాన్ తన సైనిక ప్రణాళికల కోసం ఉపయోగించుకోవడానికి… పశ్చిమ దేశాలపై దాడులకు ఉసికొల్పడానికి ఉపయోగిస్తున్నట్లు కనుగొనడంతో ఇజ్రాయెల్ టార్గెట్ చేసి లేపేసింది. ఈ భూగర్భ బంకర్ టెహ్రాన్ నగరంలో పలు వీధుల్లో విస్తరించి ఉంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన కీలక వ్యక్తులు సమావేశమయ్యే గదుల నుంచి భద్రతా నిబంధనలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. పక్కా సమాచారంతో బంకర్‌ను పేల్చేసినట్లుగా వెల్లడించింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల, అమెరికా సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చాయి. ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు నేలరాలిపోయారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమరికాకు మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో పశ్చిమాసియా ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులు పెరిగి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
בלב טהרן: כ-50 מטוסי קרב של חיל-האוויר תקפו הבוקר, בהכוונה מדויקת של אמ"ן ובשיתוף אמ"ץ, והשמידו את הבונקר התת-קרקעי של עלי ח'אמנהאי שהוקם מתחת למתחם ההנהגה של המשטר האיראני. pic.twitter.com/jdWupfBUd3
— Israeli Air Force (@IAFsite) March 6, 2026
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!