ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, రాజమండ్రి శ్రీదేవి ప్రధాన పాత్రల్లో సూర్య వంటిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘నారి’. శశి వంటిపల్లి నిర్మించారు. కేదార్ శంకర్, ప్రమోదినీ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు. గతంలో ఈ చిత్ర టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ను తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్‌ను ఆమె మెచ్చుకున్నారు.
READ MORE: Srikalahasti: భక్తులకు షాక్.. శ్రీకాళహస్తి ఆలయంలో రూ. 50 టికెట్ రద్దు..
కాగా.. ఈ సినిమాను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం(ఫిబ్రవరి 15 ) సాయంత్రం నారి చిత్రం నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను చిన్మయి శ్రీపాద ఆలపించారు. వినోద్ కుమార్ విన్ను బాణీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మహిళా సాధికారత, స్త్రీ శక్తిని చాటేలా ఈ పాటను ప్రసాద్ సానా రచించారు. ‘ఎప్పుడూ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు, మహిళల సమస్యల మీద తీస్తున్న చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ఈ చిత్రంలో ఆమని గారి నట విశ్వరూపం చూస్తారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. అందరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంద’ అని దర్శకుడు సూర్య వంటిపల్లి అన్నారు.
READ MORE: Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి వద్ద హృదయ విదారక ఘటన.. కన్నీళ్లు ఆగవు..