ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది. అయినా కనికరించలేదు. ఈ సన్నివేశాన్ని అన్ని చూస్తున్న అభం శుభం తెలియని చిన్నారి తన తల్లిని ఒడిలో పెట్టుకుని సేవ చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను చూస్తున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. అసలేం జరుగుతుందో.. ఎవ్వరిని ఏం అడగాలో తెలియని వయసులో చిన్నారి ఉంది. ఏం చేయలేని స్థితిలో తల్లి పడుకుని ఉంది.
READ MORE: Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై ఉన్నత స్థాయి కమిటీ..
వారిది పాలమూరు జిల్లా మారేడుపల్లి గ్రామం. ఫొటో దిక్కు తోచని స్థితిలో ఉన్న మహిళ పేరు ప్రమీల. ఆమె భర్త సురేశ్ ఆరు నెలల కిందట అనారోగ్యంతో మరణించారు. భర్త మృత్యువు ఒడికి చేరుకున్న నెల రోజులకే కుమారుడు సైతం అనంత లోకాలకు చేరుకున్నాడు. ఏం చేయాలో పాలుపోక, దిక్కుతోచని స్థితిలో ప్రమీల తన ఆరేళ్ల కుమార్తెను వెంటబెట్టుకుని బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. పని దొరికితే వెళ్లూ.. లేదంటే భిక్షాటనతో తమ రెండు ప్రాణాలను నిలుపుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సర్వం కోల్పోయిన ప్రమీలను విధి వెంటాడుతూనే ఉంది. తాజాగా ప్రమీల అనారోగ్యానికి గురైంది. కదలలేని స్థితికి చేరుకుంది.
READ MORE: POCO X6 Neo 5G: క్రేజీ ఆఫర్.. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే
ప్రైవేటు ఆస్పత్రుల్లో చూయించునే స్తోమత లేని ప్రమీల తన కుమార్తెతో కలిసి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుంది. ఆమె పరిస్థితిని చూసిన వైద్య సిబ్బంది ఆధార్ కార్డు లేదన్న కారణంతో వైద్యం చేయలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియక, తన వాళ్లు అనే వారు లేక, పది రోజులుగా ఉస్మానియా ఆసుపత్రి బయటే కటికనేలపై ఇలా దీనావస్థలో పడి ఉంది ప్రమీల. ఆ అమాయకపు చిన్నారి తల్లికి సపర్యాలు చేస్తోంది. దవాఖాన వద్ద దాతలు పెట్టే అన్నంతో తన కూతురుతో పాటు తానూ కడుపు నింపుకుంటోంది. దాతలు అందించిన అన్నం తినేందుకు కూడా ప్రమీల ఆరోగ్యం సహకరించడం లేదు. తన ఆరేళ్ల బిడ్డే తనకు తల్లిగా మారింది. ఆమె ప్రాణాలను నిలిపేందుకు ఆ చిన్నారి అల్లాడుతోంది. మీడియాలో కథనాలు వెలువడటంతో ఆస్పత్రి సిబ్బంది ఇప్పుడు ప్రమీలను ఆస్పత్రిలో చేర్చుకున్నాయి. ఆమెకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. నిబంధనలను సరిగా అర్థం చేసుకోకుండా.. జనాన్ని గాలికి వదిలేస్తున్న కొందరు వైద్య సిబ్బంది నిర్వాకం వల్ల ఈ ఘటన జరిగింది. వెంటనే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. వారిని సస్టెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.