మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానాల పనితీరు దుర్భరంగా ఉందని.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. తాజాగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ నిర్ణయించారు.
హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తమయ్యి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని.. సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయిదు కోట్లు పైనే ఉంటుందన్నారు..
మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు.…
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.
భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశం 2020లో కొన్ని చైనీస్ యాప్‌లను నిషేధించింది. అయితే.. ప్రస్తతం మళ్లీ ఈ యాప్స్ తిరిగి భారత్‌లోకి వచ్చాయి. 36 యాప్‌లు లను తిరిగి జాబితా చేరాయి.
రాష్ట్రపతి భవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కాగా నేడు (బుధవారం 12 ఫిబ్రవరి).. రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ (Personal Security Officer) హోదాలో పని చేస్తున్న పూనమ్ గుప్తా వివాహం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
రోహిత్ శర్మ చాలా కాలం విఫలమవుతున్నాడు. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 16 నెలల తర్వాత రోహిత్ వన్డేల్లో సెంచరీ సాధించాడు. 7 సిక్స్ లు, 9 ఫోర్లతో చెలరేగాడు. వన్డేల్లో రోహిత్ శర్మకి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. 2023 లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేశాడు.
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలో ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కెరటాల దాటికి కొట్టుకుపోయారు.. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్య తేజ లుగా గుర్తించారు.. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు..