మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ. ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు.. టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. కాగా.. తాజాగా కుంభమేళాలో స్నానమాచరించిన భక్తుల సంఖ్యను యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 55 కోట్ల మంది మహా కుంభమేళాలో స్నానం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికీ ఇంత భారీ సంఖ్యలో జనాలు హాజరు కాలేదు.. జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక సంబరం ఫిబ్రవరి 26వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. మహా శివరాత్రికి
READ MORE: The Devil’s Chair: సంతోషపడాలా? బాధపడాలా? అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు
అన్నిదారులు ప్రయాగ్ రాజ్ వైపే. ఏ రైలు చూసినా, ఏ బస్సు చూసినా కిటకిటే. ఎవరినోట విన్న కుంభమేళామాటే. శని, ఆదివారాలు వారాంతాన్ని వాహనాల నిషేధిత ప్రాంతంగా ప్రకటించినందున, ఎక్కువ దూరం నడిచి వెళ్తున్నప్పటికీ, భక్తులు ఇక్కడ చేసిన ఏర్పాట్లతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మహా కుంభమేళా చివరికి చేరుకుంటుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. కనీసం ఒక కాలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా తయారవుతోంది. మహా కుంభ్ ప్రాంతం నుంచి నగరానికి వెళ్ళే అన్ని రోడ్లు, దారులు భక్తుల రద్దీతో నిండి ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్ ను కొన్ని రోజులు మూసేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతాన్ని వాహన రహిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత, భారీ రద్దీ కారణంగా భక్తులు అనేక కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది.
READ MORE:Cancer Vaccine: ఐదారు నెలల్లో క్యాన్సర్ టీకా.. వారికి మాత్రమే అందిస్తామన్న కేంద్ర మంత్రి