కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… ” కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీకు ఉనికి లేదు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్ లు ఇస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గ్రాప్ పడిపోయిందని కార్యకర్తల ముందు అంటున్నారు. కేవలం కార్యకర్తలను ఉత్తేజ పర్చడానికే కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది చెప్పారు. ఆయనకు చిత్తశుద్దే లేదు. చిత్త శుద్ధి ఉంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి ప్రజల సమస్యలు చర్చించే వారు.” అని ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: South Central Railway: చర్లపల్లి టర్మినల్ నుంచి ధానాపూర్ కు ప్రత్యేక రైళ్లు
ఇదిలా ఉండగా.. నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు. “సిల్వర్ జూబ్లీ వేడుకలే ఇంపార్టెంట్. ఈ సీఎం ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. మనం ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయాం. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. అదే అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చేయించుకోవడం రావడం లేదు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయి. మీరు సిద్ధంగా ఉండండి. మళ్లీ మనదే అధికారం.. మీరే ఎమ్మెల్యేలు అవుతారు.” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.