ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. రియాల్టర్ చక్రధర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
READ MORE: Mahakumbh 2025 : కుంభమేళాలో స్నానం చేసిన ట్రంప్, కిమ్, ఎలాన్ మస్క్.. వైరల్ అవుతున్న వీడియో
ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఏ1, రాధా కిషన్ రావు ఏ2గా పోలీసులు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురు నిందితులు.. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు. ఈ ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొన కుండా బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
READ MORE:MP Chamala Kiran: కేసీఆర్ ఉప ఎన్నిక వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫస్ట్ రియాక్షన్..