హైదరాబాద్: కాచిగూడ ఐనాక్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. సమయానికి సినిమా వేయలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కమిషన్ ఐనాక్స్ యాజమాన్యానికి రూ.10వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా లైసెన్స్ అథారిటీ కింద మరో రూ.లక్ష ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2019, జూన్ 22న తార్నాకకు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి ‘గేమ్ ఓవర్’ అనే సినిమాను వీక్షించేందుకు కాచిగూడలోని ఐనాక్స్‌కు వెళ్లాడు. అయితే సినిమా టిక్కెట్‌పై ఉన్న సమయం…
భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సచిన్ స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, పౌరులను ట్విటర్ వేదికగా సచిన్ అభినందించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్ కండిషన్‌లో ఉన్న తన స్నేహితురాలిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని..…
హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో భారీ మారథాన్ జరగనుంది. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కిలోమీటర్ల మారథాన్‌ను నిర్వహించనున్నారు. ఈ మారథాన్‌కు ఇప్పటికే 6వేల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ 10వ ఎడిషన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల…
తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read Also:…
మహిళలకు గర్భం దాల్చడం అనేది వారి జీవితంలో కలిగే మధురానుభూతి. మహిళలు గర్భం దాలిస్తే కడుపులోని బిడ్డ గర్భాశయంలో పెరగడం సాధారణ విషయం. కానీ ఓ మహిళకు మాత్రం కడుపులోని బిడ్డ కాలేయంలో పెరుగుతుండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే… కెనడాలోని 33 ఏళ్ల మహిళకు వింత అనుభవం ఎదురైంది. తాను గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన తరువాత 14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఆమె చెకప్ చేయించుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్…
భారత ప్రధాని మోదీని భూటాన్ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ విషయాన్ని భూటాన్ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా సమయంలో తమకు అందించిన మద్దతుకు గుర్తింపుగా తమ దేశ అత్యున్నత అవార్డు ‘నగ్‌డగ్ పెల్ గి ఖోర్లో’ను మోదీకి బహూకరించాలని భూటాన్రాజు జిగ్మే ఖేసర్నగ్మే వాంగ్చుక్సూచించినట్లు తెలిపింది. ఈ అవార్డును 2008లో భూటాన్ ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీయుడు మన ప్రధాని మోదీ మాత్రమే. Read…
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్‌ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్‌పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నింటిలో 90కి పైగా మార్కులు రాగా మరికొన్నింట్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థికి ఇంగ్లీష్‌లో 92 మార్కులు, సంస్కృతంలో 93 మార్కులు, ఫిజిక్స్‌లో 55 మార్కులు, కెమిస్ట్రీలో 50 మార్కులు రాగా మ్యాథ్స్ Aలో 27, మ్యాథ్స్ Bలో…
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. Read Also: దేశవ్యాప్తంగా రెండు…
ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది. సంక్షేమ పథకం అందాలంటే ఆధార్ ఉండి తీరాల్సిందే. స్కూల్‌లో అడ్మిషన్ కావాలన్నా.. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా కూడా ఆధార్ కావాల్సిందే. ప్రస్తుతం ఏడాది దాటిన వారికే ఆధార్ ఇస్తుండగా ఇకపై పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ కార్డు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సన్నాహాలు చేస్తోంది. Read Also: ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్…