గర్భం దాల్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్టు చూసి షాకైన డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు గర్భం దాల్చడం అనేది వారి జీవితంలో కలిగే మధురానుభూతి. మహిళలు గర్భం దాలిస్తే కడుపులోని బిడ్డ గర్భాశయంలో పెరగడం సాధారణ విషయం. కానీ ఓ మహిళకు మాత్రం కడుపులోని బిడ్డ కాలేయంలో పెరుగుతుండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే… కెనడాలోని 33 ఏళ్ల మహిళకు వింత అనుభవం ఎదురైంది. తాను గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన తరువాత 14 రోజులుగా రుతుస్రావం అవుతుండటంతో ఆమె చెకప్ చేయించుకునేందుకు వైద్యుల వద్దకు వెళ్లింది. అయితే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసిన వైద్యులు… కాలేయం(లివర్)లో పిండం పెరుగుతుండాన్ని గమనించారు. అయితే కాలేయంలో పెరుగుతున్న పిండంలో బిడ్డ చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. శస్త్ర చికిత్స ద్వారా కాలేయంలోని పిండాన్ని తొలగించి మహిళను బతికించామని వారు వెల్లడించారు.

Read Also: ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
- Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
గర్భాశయం వెలుపల అండం తనకు తానే ఫలదీకరణం చెందడం వల్ల ఇలాంటి గర్భం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ మైఖేల్ వివరించారు. తన జీవితంలో చాలా రకాల కేసులను చూశానని.. కానీ ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని డాక్టర్ మైఖేల్ వెల్లడించారు. నిజానికి అండాశయం నుంచి గర్భకోశానికి ఒక పైప్‌లాంటి మార్గం ఉంటుందని… ఆ మార్గం ద్వారా గర్భాశయానికి అండాలు ప్రయాణిస్తాయన్నారు. మధ్యలో ఏ అండం అయినా ఇరుక్కుపోతే.. అక్కడే పిండంలా ఏర్పడుతుందన్నారు. కానీ.. ఆ పిండంలో ఎదుగుదల ఉండదని.. అటువంటి గర్భం కూడా నిలబడదని స్పష్టం చేశారు. ఈ మహిళ విషయంలో కూడా అదే జరిగింది… కానీ ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
https://www.instagram.com/p/CXksHRUNk49/?utm_medium=copy_link
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!