సమయానికి సినిమా వేయలేదని.. రూ.1.10 లక్షలు జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: కాచిగూడ ఐనాక్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. సమయానికి సినిమా వేయలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కమిషన్ ఐనాక్స్ యాజమాన్యానికి రూ.10వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా లైసెన్స్ అథారిటీ కింద మరో రూ.లక్ష ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2019, జూన్ 22న తార్నాకకు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి ‘గేమ్ ఓవర్’ అనే సినిమాను వీక్షించేందుకు కాచిగూడలోని ఐనాక్స్‌కు వెళ్లాడు. అయితే సినిమా టిక్కెట్‌పై ఉన్న సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రదర్శించాలి. కానీ ఐనాక్స్ యాజమాన్యం ప్రకటనలు వేసి సా.4:45 గంటలకు సినిమాను ప్రదర్శించింది.
Read Also: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
దీంతో ఐనాక్స్ యాజమాన్యంపై ప్రేక్షకుడు విజయగోపాల్ అసహనం వ్యక్తం చేశాడు. సుమారు 15 నిమిషాలు విలువైన సమయాన్ని వృథా చేశారని థియేటర్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందన లేకపోవడంతో చివరకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం 1955 ప్రకారం తాము ప్రకటనలు వేసినట్లు ఐనాక్స్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ పిటిషన్‌పై విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం బెంచ్.. నిబంధనల ప్రకారం 5 నిమిషాలు మాత్రమే ప్రకటనలు వేయాలని.. 15 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు ఇచ్చింది. దీంతో నష్టపరిహారంగా ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ.5 వేలు, కేసుల ఖర్చుల కింద మరో రూ.5వేలు చెల్లించాలని ఐనాక్స్‌ను ఆదేశించింది. మరోవైపు లైసెన్సింగ్ అథారిటీ కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పెనాల్టీ కింద మరో రూ.లక్ష చెల్లించాలని.. ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు విపత్తు నిధిగా వాడాలని హితవు పలికింది.
తాజావార్తలు
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!