హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్‌ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్‌పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
Read Also: చేవెళ్ల నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర
ఈ నేపథ్యంలో సుమారు 6,340 స్తంభాలకు 13,392 ఎల్ఈడీ లైట్లను అధికారులు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య 22 కిలోమీటర్ల మేర రూ.30 కోట్లతో 2018లోనే లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 158 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. ఈ లైట్లను గురువారం రాత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్ఈడీ దీపాల వెలుగులో ఓఆర్ఆర్ వెలిగిపోతున్న ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
Ministers @KTRTRS, @chmallareddyMLA and @SabithaindraTRS inaugurated the newly installed LED Lights on ORR, Hyderabad. MP @DrRanjithReddy, MLA @GMRMLAPTC and Special CS @arvindkumar_ias graced the occasion. pic.twitter.com/jlYYeKDOTS
— KTR, Former Minister (@MinisterKTR) December 16, 2021