ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదలైంది. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప ది రైజ్ చివర్లో సెకండ్ పార్ట్ మూవీ పేరును దర్శకుడు సుకుమార్ రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప-ద రూల్’…
తెలంగాణలో చలి విపరీతంగా పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావం వల్ల చలి తీవ్రస్థాయిలో పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఉత్తరాది నుంచి బలమైన చలిగాలులు వీయనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈనెల 18 నుంచి 20 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 10 డిగ్రీల వరకు నమోదు కావచ్చని సూచించారు. Read Also: ఇంటర్ విద్యార్థి సంచలన ట్వీట్.. నా సూసైడ్‌కు కారణం…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో ఆరోపించాడు. తన సూసైడ్‌కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. Read…
ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ-గంగూలీ ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని.. టీ20 కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పుడు తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం చెప్పలేదని కోహ్లీ చెప్పడంతో వివాదం చెలరేగింది. మరోవైపు విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పినా వినలేదని గతంలో గంగూలీ చెప్పిన…
ఈనెల 17న ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖ వెళ్లనున్న ఆయన… సాయంత్రం 5:10 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో ఆరు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కలనాయుడు బాబు కుమార్తె దివ్యానాయుడు వివాహ వేడుకకు సీఎం…
జాతీయ స్థాయి మహిళా యువ షూటర్ కొనికా లాయక్ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్న స్థితిలో కొనికా లాయక్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో భారత క్రీడా రంగంలో విషాదం నెలకొంది. అయితే తాను ఇష్టపడి ఎంచుకున్న షూటింగ్ క్రీడలో రాణించలేకపోవడం వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కొనికా లాయక్ ఓ సూసైడ్‌నోట్ రాసిందని పోలీసులు చెప్తున్నారు. హాస్టల్ గదిలోనే ఈ సూసైడ్…
ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు అందింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం సోనియాతో డీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాతే డీఎస్ చేరికపై…
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. రేపు ‘పుష్ప’ సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ల రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరిచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు కూడా హైకోర్టు సూచించింది. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని కూడా హితవు పలికింది.…
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. Read Also: ఎన్నికల…
మెట్రో మ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీధరన్ ప్రకటించారు. తనకు తత్వం బోధపడిందని.. ఎన్నికల్లో పోటీ చేసి తగిన గుణపాఠం నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని… ఇంకా రాజకీయాల్లో ఉండటం, రాజకీయంగా కెరీర్ కొనసాగిస్తే మరింత ప్రమాదంలో పడతానని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతగా ఉండటం తనకు ఇష్టం లేదని.. రాజకీయాలను చేయడం తన డ్రీమ్ కూడా కాదని శ్రీధరన్ స్పష్టం చేశారు. Read Also:…