Home
Latest Telugu News
Latest Telugu News News
-
కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి సలహా మండలి అనుమతి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే సొంత వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించిందని…. ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది. Read Also: ఎన్నికల… -
రాజకీయాలకు మెట్రోమ్యాన్ శ్రీధరన్ గుడ్‌బై
మెట్రో మ్యాన్ శ్రీధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీధరన్ ప్రకటించారు. తనకు తత్వం బోధపడిందని.. ఎన్నికల్లో పోటీ చేసి తగిన గుణపాఠం నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనకు 90 ఏళ్లు అని… ఇంకా రాజకీయాల్లో ఉండటం, రాజకీయంగా కెరీర్ కొనసాగిస్తే మరింత ప్రమాదంలో పడతానని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతగా ఉండటం తనకు ఇష్టం లేదని.. రాజకీయాలను చేయడం తన డ్రీమ్ కూడా కాదని శ్రీధరన్ స్పష్టం చేశారు. Read Also:… -
మగబిడ్డకు జన్మనిచ్చిన టీడీపీ మాజీ మంత్రి
టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా నాయకురాలు భూమా అఖిలప్రియ గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. భూమా అఖిల ప్రియ తన తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. Read Also: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన… -
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను అధికారులు ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in లేదా manabadi.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.… -
ఉద్యోగ సంఘాలతో కొనసాగుతున్న బుగ్గన, సజ్జల చర్చలు
పీఆర్‌ఎస్‌తో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగారు. అయితే ఇటీవల సీఎస్ సమీర్ శర్మ కమిటీ పీఆర్‌సీపై నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. అయితే సీఎస్ కమిటీ ఫిట్‌మెంట్ 14.29 ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే సీఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు… -
పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి
బిగ్‌బాస్-5 కంటెస్టెంట్, బుల్లితెర ప్రముఖ యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ యాంకర్ రవి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునేవాడిని కాదని.. కానీ తన కుటుంబసభ్యులపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. Read Also: హ్యాట్సాఫ్.. మానవత్వం… -
గుడ్‌న్యూస్… తగ్గిన నెట్‌ఫ్లిక్స్ మెంబర్‌షిప్ ఛార్జీలు
కరోనా పుణ్యమా అని ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. సినిమా థియేటర్లు తెరిచినా ఓటీటీలు ఉన్నాయి కదా అని చాలా మంది వెళ్లడం లేదు. దీంతో పలు ఓటీటీ సంస్థలు ఛార్జీలు పెంచే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ సంస్థ ప్రైమ్ మెంబర్‌షిప్ ఛార్జీలు భారీగా పెంచింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓటీటీ ప్రియులకు ఓ వైపు అమెజాన్ షాక్ ఇవ్వగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాత్రం గుడ్‌న్యూస్ చెప్పింది. Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన… -
హ్యాట్సాఫ్.. మానవత్వం బతికే ఉందని నిరూపించాడు
ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు… -
బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండైంది. Read Also: అమరావతి రాజధాని రైతులకు టీటీడీ గుడ్ న్యూస్ వాస్తవానికి ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రి నుంచి తిరుపతి రావాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం తిరుపతికి ఈరోజు ఉ.10:55 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ… -
మెగాస్టార్ ‘ఆచార్య’కు పోటీగా సూర్య సినిమా
తమిళ అగ్ర హీరో సూర్య సినిమాలు ఇటీవల వరుసగా ఓటీటీల్లో విడుదలయ్యాయి. గత ఏడాది ఆకాశమే నీ హద్దురా, ఈ ఏడాది జై భీమ్ సినిమాలతో సూర్య మంచి హిట్లు అందుకున్నా ఆ సినిమాలు థియేటర్లలో విడుదలైతే బాగుండేదని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో సూర్య కొత్త సినిమా థియేటర్లలోనే రాబోతోంది. సూర్య నటించిన తాజా సినిమా ‘ఈటీ’ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఐదు భాషల్లో…
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!