నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మార్కండేయ లిఫ్ట్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. బిజినేపల్లి మండలంలోని శాయిన్‌పల్లిలో నిర్మించిన మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
READ MORE:Sabarimala Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. వారందరికి ఉచిత ప్రమాద బీమా
ఇటీవల మార్కండేయ ఎత్తిపోతల పంపుహౌజ్‌లో మోటారు ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం బిజినేపల్లిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. “మార్కండేయ ఎత్తిపోతల కింద 7,300 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల నిర్మాణానికి రూ. 77.61 కోట్లు వెచ్చించాం.” అని పేర్కొన్నారు.
READ MORE: CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్