రోజురోజుకు డ్రగ్స్ వాడకం ఎక్కువవుతోంది. ఒత్తిడి లోనైన యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారికి కొత్త కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ కమిషనర్.. సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ వినియోగదారులకి ఉత్సవాల కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నామన్నారు. వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టబోతున్నట్లు సీటీ పోలీస్ బాస్ పేర్కొన్నారు. వారానికి ఒకసారి వినియోగదారుల రక్త, మూత్ర పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
హాస్పిటల్స్ ఎన్జీవోలతో ఒప్పందం చేసుకున్న పోలీసులు.. డ్రగ్స్ వినియోగదారుల అనుమతితోనే బ్లడ్ ,యూరిన్ పరీక్షలు చేస్తామంటున్నారు. ఇప్పటివరకు మూడు వందల పైచిలుకు డ్రగ్స్ వినియోగదారులని చేశామని సీపీ ఆనంద్ వెల్లడించారు. జైల్ నుంచి కొంతమంది బయటకు వచ్చి మళ్ళీ డ్రగ్స్ వినియోగిస్తున్నారు.. వినియోగదారుల ను కట్టడి చేసేందుకే కొత్త కౌన్సిలింగ్ విధానం తీసుకువచ్చామని సీపీ తెలిపారు.